అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట భూ వివాదానికి సంబంధించిన కేసు విచారణకు హాజరు కానందుకు HYDRA (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ) కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బతుకమ్మ కుంట భూ వివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. HYDRA కమిషనర్‌పై మండిపడిన హైకోర్టు, “న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా?” అని ప్రశ్నించింది.
తదుపరి విచారణకు హాజరు కాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ, “అవసరమైతే ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతాము” అని స్పష్టం చేసింది.కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనను తాము సహించబోమని, తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read:నరేష్ అగస్త్యతో చైతన్య గండికోట

