కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. పేదింటి బడ్జెట్ అన్నారు.. పేదింటి రాయితీలు ఎక్కడ లేవన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన…తెలుగు మహిళా బడ్జెట్ ప్రవేశ పెట్టినా.. తెలుగు రాష్ట్రాలకి ఎటువంటి లాభం లేదని ఎద్దేవా చేశారు.
దేశ ఆర్ధిక పునాదులు కాంగ్రెస్ హయాంలో బలంగా ఉన్నాయని.. ఉత్పత్తులు పెరిగే విధంగా బీజేపీ ఏమైనా కార్యక్రమాలు చేసిందా అని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల చుట్టే బడ్జెట్ ఉందన్నారు. సమయం ఇస్తే కాంగ్రెస్ పాలనలో ఏం చేశామో… మీ హయంలో ఏం చేసారో చెపుతాము… చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఉపాధి రంగాన్ని కాపాడటానికి బడ్జెట్ లో ఎక్కడా కేటాయించలేదని… దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు చాలా ఎక్కువగా పెరిగాయని మండిపడ్డారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో చాలా పెద్దది అన్నారు..మరి హైదరాబాద్ మెట్రో పొడిగింపునకు, విస్తరణకు ఏం కేటాయించలేదన్నారు.