పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్ది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితం అయిన హస్తం పార్టీ ఈసారి పది స్థానాలకు పైగా విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే సీట్ల విషయంలో సొంత నేతలతోనే ఆ పార్టీకి చిక్కులు తప్పేలా లేవు.
ఎందుకంటే పార్టీలోని కొంతమంది కీలక నేతలు వారి కుటుంబ సభ్యులను లోక్ సభ ఎన్నికల బరిలో నిలపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు ఆ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఖమ్మం సీటు కోసం ప్రస్తుతం మంత్రులుగా పని చేస్తున్న భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క ఆయన భార్య నందినిని ఖమ్మం నుంచి పోటీలో ఉంచాలని ప్రయత్నిస్తుంటే.. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని ఇదే సీటు నుంచి పోటీ చేయించేందుకు సిద్దమయ్యారట..
దీంతో ముఖ్య నేతలు ఖమ్మం సీటు కోసం గట్టిగా పోటీ పడుతుండడంతో ఈ సీటు ఎవరికి కేటాయించాలో తెలియక తల పట్టుకుంటుందట పార్టీ అధిష్టానం. అంతే కాకుండా ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎక్కువ శాతం కీలక నేతల కుటుంబ సభ్యులే రేస్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో సీట్ల కేటాయింపుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు సీట్లను ఫైనల్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు పార్టీల నేతల పోటాపోటీ వ్యవహారం అంతర్గత లొసుగులను బయట పెడుతోంది. ఆ మద్య అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ లో ఇదే పరిస్థితులు తారసపడ్డాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా సిట్లకోసం ఇదే పరిస్థితులు కనిపిస్తుండడంతో అధిష్టానం ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.
Also Read:యాక్టీవ్ అవుతున్న కీర్తి సురేష్