తీవ్ర తర్జనభర్జనల అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ మేరకు రేపు(జూన్ 10)న ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి బీజేపీ నేతలు పొంగులేటిని పార్టీలో చేర్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ అది ఏమాత్రం ఫలించలేదు. ఇక మెజార్టీ అనుచరుల నిర్ణయం మేరకు కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటి డిసైడ్ అయ్యారు. జూన్ 28 తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు రాహుల్ లేదా ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉంది.
Also Read:చేప ప్రసాదం.. 32 కౌంటర్లు
పార్టి విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో పొంగులేటితో పాటు జూపల్లిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. అనంతరం నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Also Read:జూన్ 10..భగవంత్ కేసరి టీజర్