ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్‌ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రహస్యంగా వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు. కొంతకాలంగా బీఆర్ఎస్ ఆధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన షర్మిలతో భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకొంది.
ఖమ్మంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన సమయంలో పొంగులేటి బీఆర్ఎస్ పై ఖమ్మం జిల్లా మంత్రులను పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటి వస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో వైఎస్ షర్మిలతో భేటీ కావడం పట్ల పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీలో ఉంటానని సన్నిహిత వర్గాల్లో గుసగుసలు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్‌లో గత కొంత కాలంగా తనకు జిల్లా నాయకులతో అంతర్గత విభేదాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన పరిష్కిరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగేళ్లుగా ఏ పదవిలో లేకున్నా ప్రజలతోనే మమేకమవుతూ వచ్చానని తెలిపారు. దీంతో జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళ్తానని పేర్కొనడం విశేషం. అయితే దీనికి బలం చేకూర్చుతూ…షర్మిలతో భేటీ ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకొంది.
ఇవి కూడా చదవండి….