Ponguleti:సొంతింటి కలను నిజం చేస్తాం

23
- Advertisement -

ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నిజం చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన పొంగులేటి..ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని భద్రాచల రాముడి సన్నిధిలో ఈ పథకం మొదలు పెడుతున్నామన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. అంతకుముందు సీఎం రేవంత్‌తో కలిసి భద్రాచలం సీతారామ చంద్రుల స్వామిని దర్శించుకున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి గర్భగుడిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర మంత్రులు పూజలు చేశారు.

Also Read:క్యారీ ఒంటరిపోరాటం..ఆసీస్ అద్భుత విజయం

- Advertisement -