- Advertisement -
ఓటు హక్కు వినియోగంపై కొంతకాలంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుంది. కానీ ఈసారి పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈసీ.
ఈవీఎంలపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో మనం ఎవరికి ఓటు వేశా మోచూసుకునేలా వీవీప్యాట్ ఏర్పాటు చేసింది ఈసీ. వీవీప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు మనం ఎవరికి ఓటు వేశామో తెలుస్తుంది. పోలింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
దీనికి తోడు గతంలో కంటే ఓటర్లు పెరిగారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియో గించేలా చేయడంతో పాటు వేసవి కావడతో సాయంత్రం టైంలో ఓటర్లు ఎక్కువగా పోలింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -

