1000 కోట్ల మహాభారతానికి బ్రేక్‌..!

324
Mohanlal
- Advertisement -

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రలో 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న సినిమా మహాభారతం. ప్రముఖ రచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాండ మూజమ్’ నవల ఆధారంగా, ‘మహాభారతం’ సినిమాను రూపొందనుండగా.. ఈ చిత్రాన్ని పారిశ్రామికవేత్త బీఆర్ శెట్టి నిర్మించాలని భావించారు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను 2020 నాటికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనునట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ మూవీ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదనేది తాజా సమాచారం. దర్శక నిర్మాతల మధ్య వచ్చిన మస్పర్ధలే అందుకు కారణమని తెలుస్తోంది. తాజాగా బీఆర్ శెట్టి స్పందిస్తూ .. “శ్రీకుమార్ మీనన్ తో విభేదాలు తలెత్తాయి. మంచి రచయిత .. దర్శకుల కోసం అన్వేషణ సాగుతోంది. ఆలస్యమైనా ఈ సినిమాను తప్పకుండా నిర్మించి తీరుతాను” అని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ మహా భారతం ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తి అవుతుందో చూడాలి.

- Advertisement -