మే 13న వేతనంతో కూడిన సెలవు ..

15
- Advertisement -

మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎంపీ, ఏపీలో అసెంబ్లీ, ఎంపీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.

నేటితో నామినేషన్ల పర్వం ముగియనుండగా రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు ఈనెల 29 వరకు తుది గడువు విధించారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానానికి, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Also Read:Harishrao:రాజీనామాకు రేవంత్ సిద్ధమా?

- Advertisement -