జార్ఖండ్‌..తొలి దశ ఎన్నికల పోలింగ్

10
- Advertisement -

జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. జార్ఖండ్‌తో పాటు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీచేస్తోన్న కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప-ఎన్నికకు పోలింగ్‌ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దశంలో 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మాజీ సీఎం చంపయీ సోరెన్, అతడి కుమారుడు బాబూలాల్ సోరెన్ కాంగ్రెస్‌ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాఝీ, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా, మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా, మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ కోడలు పూర్ణిమా దాస్‌ వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అలాగే దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని మరో 31 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. రాజస్థాన్‌లో ఏడు, పశ్చిమ్ బెంగాల్‌లో ఆరు, అసోంలో ఐదు, బిహార్ నాలుగు, కర్ణాటకలో మూడు, మధ్యప్రదేశ్‌లో రెండు, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

Also Read:కంటివెలుగు కతమయింది..తెలంగాణ భవిష్యత్ చీకటయింది

- Advertisement -