గత కొన్ని రోజులుగా శాసనసభ రద్దు చేస్తారని, కొత్త పథకాలు ప్రవేశపెడతారని పేపర్లు, టీవీలు రాశాయని అలా రాయడం భావ్యం కాదన్నారు సీఎం కేసీఆర్. నేడు జరిగిన ప్రగతినివేదన సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ..తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ నిర్ణయాలన్నింటినీ త్వరలోనే చెప్తానని తెలిపారు.
కాగా..త్వరలోనే కే కేశవరావు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ వేస్తాం. టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది మేనిఫెస్టోలో చెప్తాం. త్వరలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్ని అంశాలను వివరంగా చెప్తామని సీఎం తెలిపారు.
అధికారంలో ఉంటే ఆత్మగౌరవంతో ఉంటాం. నిరుద్యోగులను కూడా ఆదుకుంటాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రావాలని సీఎం కేసీఆర్ పేర్కొంటూ..తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం రాజకీయ నిర్ణయాలు త్వరలోనే తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.