కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు..

356
kathi
- Advertisement -

రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తిమహేష్‌కు గట్టి షాక్ తగిలింది. కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగుపెట్టవద్దని ఆదేశాలు జారీ చేసిన పోలీసులు మహేష్‌ని ఏపీ పోలీసులకు అప్పగించారు.

రామాయణం అనేది ఓ కథ మాత్రమేనని.. రాముడనేవాడు ఎంత ఆదర్శవంతుడో అంత దగుల్బాజీ అని నేను నమ్ముతాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు ఆ కథలో సీత బహుశా రావణుడితోనే ఉంటే బాగుండేదేమో అంటూ మాట్లాడటం పెను దుమారం రేపింది. కత్తి మహేష్‌పై హిందూ ధార్మిక సంస్థలతో పాటు సంఘ్ పరివార్ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పలు ప్రాంతాలలో ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులతో సహా రాజకీయ నాయకులు సైతం కత్తి మాటలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్‌ని హైదరాబాద్ రావొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -