వీడియో లీక్‌..పుకార్లు నమ్మకండి: పోలీసులు

50
punjab
- Advertisement -

పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థినిల వీడియో లీక్ అంశంతో స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వీడియో పంపించిన యువతి స్నేహితుడిని సిమ్లాలోని, రోహ్రు ప్రాంతంలో అరెస్టు చేశారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నిందితుల్ని విచారిస్తున్నామని, వాళ్ల ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని, పుకార్లను నమ్మొద్దని కోరారు.

పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఒక అమ్మాయి, తన తోటి విద్యార్థినిల ప్రైవేటు వీడియోల్ని స్నేహితుడికి పంపినట్లు వివాదం మొదలైంది. చాలా మందికి చెందిన 60 వరకు వీడియోల్ని ఆ అమ్మాయి, తన స్నేహితుడికి పంపిందనే ప్రచారం జరిగింది. దీంతో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ ఘటనపై యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. ప్రచారం జరుగుతున్నట్లుగా 60 ఎమ్మెమ్మెస్ వీడియోలు లీక్ కాలేదని, వీడియోను పంపిన విద్యార్థిని తన సొంత వీడియోను మాత్రమే అతడికి పంపిందని అధికారులు తెలిపారు.

- Advertisement -