- Advertisement -
సినీ నటుడు నాగశౌర్య విల్లాపై పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో భాగంగా పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాపై దాడి చేశారు.
సుమన్ అనే వ్యక్తి బర్త్ డే పార్టీ సందర్భంగా పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి రూ. 6.7 లక్షల నగదు, 33 సెల్ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల క్రితమే ఈ విల్లాను నాగశౌర్య అద్దెకు తీసుకోగా ఫామ్‌హౌస్‌ను పేకాట స్థావరంగా మార్చిన విషయం నాగశౌర్యకు తెలుసా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -