ఆర్టీసీ సమ్మెపై పోలీసుల ఉక్కుపాదం

3
- Advertisement -

ఆర్‌టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు తాండూరు పోలీసులు విడుదల చేసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాండూర్ పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాపు ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ & కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తులందరికి తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తున్నది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది మరియు గవర్నమెంట్ కు వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు.

కావున పైన తెలిపిన వ్యక్తులందరూ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు గాని టెంట్లు గాని ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో, అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని ఎస్‌హెచ్‌వో పేరుతో లేఖను విడుదల చేశారు.

- Advertisement -