దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొళ్తాపడింది. నిర్మాత పూరితో పాటు డిస్ట్రిబ్యూటర్,ఫైనాన్షియర్లు పూర్తిగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని డబ్బూలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు పూరి. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే కొంతమంది అత్యుత్సాహంతో పూరి ఆఫీస్ ముందు ధర్నాకు దిగగా వారికి డబ్బులు ఇచ్చేది లేదని హెచ్చరించారు. అంతేగాదు నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ ఇంటికి భద్రత కల్పించాలని కోరగా పోలీసులు పూరి జగన్నాధ్ ఇంటివద్ద భద్రత పెంచారు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లో లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ధర్నాని వాయిదా వేశారు. ఈ అంశంపై న్యాయస్ధానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు డిస్ట్రిబ్యూటర్లు. దీంతో ఈ వివాదం రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..