- Advertisement -
విశాఖపట్నంలోని ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జబర్ధస్త్ నటులు దొరబాబు, పరదేశిలు పట్టుబడ్డారు. మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. దొరబాబు, పరదేశితో పాటు ఒక మహిళ, నలుగురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 వేల నగదును కూడా సీజ్ చేశారు.
వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొరబాబు, పరదేశిలు గత కొంత కాలంగా హైదరాబాద్ నుంచి మహిళలను తీసుకువచ్చి విశాఖపట్నంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దొరబాబు, పరదేశిలు హైపర్ ఆది టీంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Advertisement -