పోలీస్ కస్టడీకి భూమా అఖిల ప్రియ…

18
bhuma

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురైంది. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ-1 నిందితురాలిగా ఉన్న భూమా బెయిల్ పిటిషన్‌ని కొట్టివేసింది సికింద్రాబాద్ న్యాయస్ధానం. అంతేగాదు విచారణ కోసం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది న్యాయస్ధానం. దీంతో పోలీసులు ఆమెను బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ కేసులో అఖిల ప్రియను పదిరోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని బోయిన్ పల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 13వ తేదీ వరకు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది.