- Advertisement -
డైరెక్టర్ రాజమౌళిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించడంతో.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టాడని ఫిర్యాదు చేశారు కొంతమంది.
అలాగే బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడని రాజమౌళిపై మరో ఫిర్యాదు నమోదైంది.
ఇప్పటికే వారణాసి ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాష్ట్రీయ వానర సేన సంఘం. హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు సంపాదిస్తున్న సినీ రంగ ప్రముఖులు, కార్యక్రమాలలో ఇలాంటి ప్రసంగాలు చేసి మతాల మధ్య విద్వేషం రగిలిస్తున్నారని వానర సేన ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read:సత్యసాయి శత జయంతి వేడుకల్లో మోదీ
- Advertisement -

