మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక భర్త జోన్నలగడ్డ చైతన్యపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. నిహారిక ఇంట్లో అర్ధరాత్రి వేళ పెద్ద గొడవ జరగడంతో.. ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే నిహారిక భర్త కూడా అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేయడంతో ఇరువురి తరుపున ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్ నెలలో నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలస్‌లో ఘనంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత భర్తతో కలిసి రొమాంటిక్ టూర్స్ వేస్తున్న నిహారిక.. నిత్యం వార్తల్లో నిలుస్తుండటం చూస్తున్నాం. తాజాగా ఆమె భర్తపై కేసు నమోదుకావడం చర్చనీయాంశంగా మారింది.