- Advertisement -
సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కొడుకులపై జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 2012లో దాసరి నారాయణరావు …సోమశేఖర్ అనే వ్యక్తి దగ్గర రెండు కోట్ల పది లక్షల అప్పు తీసుకున్నారు. ఆ అప్పును తిరిగి చెల్లించకుండానే 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు కన్నుమూశారు.
దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఈ విషయాన్ని దాసరి కొడుకుల వద్ద ప్రస్తావించారు. అయితే పెద్ద మనుషుల సమక్షంలో ఆయన కుమారులు అరుణ్, ప్రభు అప్పు చెల్లిస్తామంటూ మాట ఇచ్చారు. రెండు కోట్ల పది లక్షలకు గానూ కోటి 15 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే తర్వాత మొహం చాటేశారు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసుపై విచారణ చేస్తున్నారు.
- Advertisement -