పోక‌ర్ణ కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

51

ప్రీమియం క్వార్ట్జ్ సర్ఫేసెస్‌ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ లిమిటెడ్ రంగారెడ్డి జిల్లాలోని మేక‌గూడ‌లో నెలకొల్పిన పరిశ్రమను మంత్రి కేటీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజ‌య్య యాద‌వ్,మర్రి జనార్ధన్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించిన పోక‌ర్ణ ఇంజ‌నీర్డ్ స్టోన్ సంస్థ, ప్రత్యక్షంగా 500 మందికి ఉద్యోగ అవకాశాలు, 3000 మందికి ఉపాధి కల్పించనుంది.