మహా సీఎం ఫడ్నవీస్‌కు బెదిరింపులు

10
- Advertisement -

మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు బెదిరింపు కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పాకిస్థాన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా ముంబై ట్రాఫిక్‌ పోలీసులకు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో మహారాష్ట్ర చీఫ్‌ మినిస్టర్‌ కార్యాలయంపై దాడి చేయనున్నట్లు బెదిరింపులకు పాల్పడ్డారు.

ఇక ఈ మెస్సేజ్ పాకిస్థాన్ నుండి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తనను తాను మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్‌గా పేర్కొన్నారు. బెదిరింపు మెసేజ్‌తో వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు సీఎం భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇటీవలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేకి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే.

Also Read:AP Budget 2025-26: ఏపీ బడ్జెట్ హైలైట్స్

- Advertisement -