సాయిధరమ్‌ తేజ్‌పై కేసు నమోదు..

114
sai
- Advertisement -

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

ఈ నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద, ఐపీసీ ఐపిసి 3, 36, 184 ఎంవి యాక్ట్ ప్రకారం కేసు నమోదైనట్టు సమాచారం.

కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరుగగా ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. తేజ్.. షోల్డర్ బొన్ విరిగినట్టు, ఇప్పటికి ఇన్ సైడ్ బ్లీడింగ్, ఆర్గాన్ డామేజ్ ఏమి లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -