కాంగ్రెస్ నేత రేణుకా చౌదరిపై కేసు…

36
si
- Advertisement -

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడిలో భాగంగా వెళ్తున్న రేణుకాను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఎస్సై ఉపేంద్ర కాలర్ పట్టుకుంది.

దీంతో ఎస్సై ఉపేంద్ర ఫిర్యాదు మేరకు 353 సెక్ష‌న్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కాలర్ పట్టుకోవడంపై ఆమెపై ఈ కేసు పెట్టారు. తన విధులకు ఆటంకం కలిగించార‌ని ఎస్ఐ చెప్పారు.

ఇక ఇది ఇలా ఉండగా రాజ్‌ భవన్ ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తించిన తీరుపై సొంతపార్టీ నేతల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అల్లర్లకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని ఆ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ డిమాండ్ చేశారు.

- Advertisement -