సి కళ్యాణ్‌పై కేసు..

158
kalyan
- Advertisement -

సినీ నిర్మాత సి కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు. ఫిల్మ్‌ నగర్‌కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి సి కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిలోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొనగా పోలీసులు కళ్యాణ్‌పై కేసు నమోదుచేశారు. సి. క‌ళ్యాణ్‌తో పాటు షారుప్‌, శ్రీకాంత్‌, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -