నారా లోకేశ్‌పై కేసు నమోదు…

64
lokesh

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై ఆపాదిస్తూ లోకేశ్‌ ట్వీట్ చేశారు.
దీనిపై వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయగా లోకేశ్‌పై డి.హిరేహాల్‌ పోలీసులు 111/2021 సెక్షన్లతోపాటు ఐపీపీ 153(ఏ), 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.