హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా గ్యాస్, డీజిల్, పెట్రోలో ధరలు మరోసారి పెంచడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ తరపున ప్రచారానికి వచ్చే కాషాయ నేతలను సామాన్యులు కడిగిపారేస్తున్నరు. మేం బీజేపీకి ఓటెయ్యం..మా ఇంటికి రావద్దు అంటూ తమ ఇండ్ల ముందు బోర్డులు పెడుతుండడంతో బీజేపీ బ్యాచ్ బిత్తరపోతోంది. ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాత్రిపూట ఈటల రాజేందర్ ఎన్నికల అధికారుల కళ్లు గప్పి సభలు పెడుతూ మొసలి కన్నీరు కారుస్తూ, ఎమోషనల్ డైలాగులు కొడుతూ..హుజురాబాద్ ప్రజల సింపతీ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఎన్నికల అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఈసీ కఠిన నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. వెయ్యి మంది కంటే సభలు నిర్వహించరాదని, రాత్రిపూట నిర్దేశిత సమయం తర్వాత మీటింగ్‌లు గట్ట్రా పెట్టరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఈ మేరకు ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచారంపై ఓ కన్నేసి ఉంచింది.
ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని పోలీసులు కేసు నమోదు చేశారు.కరోనా నిబంధనలు అతిక్రమించి ఈటల రాజేందర్ సభ పెట్టారని ఈటలపై ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు చేసింది. దీంతో హుజురాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారులు ఈ విషయమై ఈటల వివరణ కోరనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈటల ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తూ సభలు, సమావేశాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని హుజురాబాద్‌లో చర్చ జరుగుతోంది.