హీరో చంద్రహాస్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పబ్లిక్ వేదికపై అసభ్య పదజాలంతో కూడిన పాటలు పాడుతూ, బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జర్నలిస్ట్ అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చంద్రహాస్‌పై BNS 296, 296(A), 296(B), 351(2) సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 67 సెక్షన్ కింద కేసులు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లైవ్ ఈవెంట్ సమయంలో బూతు పాటలు పాడటం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగిందని, సమాజంలో తప్పు సందేశం వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని
ఫిర్యాదు స్వీకరించిన మాదాపూర్ పోలీసులు ఘటనపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలవగా, పబ్లిక్ ఈవెంట్లలో నటులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కేసుకు సంబంధించి తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

