గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

3
- Advertisement -

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ తొలి విడతగా రూ.259.36 కోట్లను మంజూరు చేసింది. ఎన్నికల జాప్యం కారణంగా గత కొంతకాలంగా ఈ నిధులు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తవడంతో పాటు, రాష్ట్ర మంత్రి సీతక్క చొరవ తీసుకోవడం, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కేంద్రంతో జరిగిన సంప్రదింపుల ఫలితంగా నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.

ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకోనున్నాయి. మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి పనులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. నిధుల విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

ఇది గ్రామ పంచాయతీలకు ఎంతో ఉపశమనం కలిగించే పరిణామమని ఆమె పేర్కొన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న మిగిలిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రామీణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని

- Advertisement -