బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌పై కేసు నమోదైంది. బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) 12వ సీజన్‌లో భాగంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అమితాబ్ ప్రశ్న అడిగారని లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమితాబ్‌తో పాటు షో నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
గత శుక్రవారం నిర్వహించిన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్‌లో సామాజిక వేత్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోనీ పాల్గొన్నారు. వీరిని రూ.6,40,000 ప్రైజ్‌మనీ ప్రశ్నగా..’డిసెంబర్ 25, 1927న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు అని అడిగారు బిగ్ బీ.
వీటికి ఏ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి అని ఆప్షన్స్ ఇవ్వగా కంటెస్టెంట్స్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత అమితాబ్ మాట్లాడుతూ.. కుల వివక్ష, అస్పృశ్యతను పెంపొందించేలా ఉందనే కారణంతో మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టారని పేర్కొన్నారు. దీంతో అమితాబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్నోకు చెందిన వ్యక్తి.