సీఎం కేసీఆర్‌కు కరోనా అంటూ తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

267
JUBILEEHILLS
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు కరోనా అంటూ తప్పుడు వార్తలు ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్ పత్రికా యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రిపోర్టర్ ఆనం చిన్ని వెంకటేశ్వర రావుతో పాటు పత్రిక యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

సీఎం కేసీఆర్‌కి కరోనా….హరితహారం కార్యక్రమంలో సోకిందా అంటూ వార్తను ప్రచురించింది ఆదాబ్ హైదరాబాద్. ఈ వార్త కథనంపై టీఆర్ఎస్ కార్యకర్త మహ్మద్ ఇలియాస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

సీఎం కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన కలిగించే కుట్రకు పాల్పడిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్, యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వీరిపై ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్34 సెక్టన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -