- Advertisement -
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రియాంక్ ఖర్గేలపై యూపీలోని రాంపూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రియాంక్ ఖర్గే మద్దతు ఇచ్చారు. ఐపీసీలోని సెక్షన్ 295-ఏ(మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), 153-ఏ(రెండు గ్రూపులను రెచ్చగొట్టడం) కింద ఇద్దరిపై కేసు నమోదు చేశారు. లాయర్లు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును నమోదు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ వేత్తలు ప్రకటనలు చేసినట్లు స్టాలిన్‌పై ఫిర్యాదు చేశారు.
Also Read:మార్నింగ్ వాక్.. రోగాలకు చెక్ !
- Advertisement -