TTD:భ‌క్తిభావ‌న పెంచేందుకు గోవింద కోటి

9
- Advertisement -

యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని, ఇందులో భాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామివారి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌లా 1,116 సార్లు గోవిందనామం రాసిన‌వారికి ద‌ర్శ‌న సౌభాగ్యం క‌ల్పిస్తామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తొలి స‌మావేశం జ‌రిగింది.

() స‌నాత‌న ధ‌ర్మం ప‌ట్ల‌, మాన‌వీయ, నైతిక విలువ‌ల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కెజి నుండి పిజి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20 పేజీల్లో భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్ని పుస్త‌క ప్ర‌సాదంగా కోటి పుస్త‌కాలు ముద్రించి పంపిణీ చేస్తామ‌న్నారు.

() అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేస్తాం.

()సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిగారు రాష్ట్రప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

() 2024 సంవత్సరం టీటీడీ క్యాలండర్లు, డైరీలను ముఖ్యమంత్రివర్యులు విడుదల చేస్తారు.

() బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా గరుడసేవనాడు విశేషంగా విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా, తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

() నేరుగా వచ్చి బ్రహ్మోత్సవాలను తిలకించలేని భక్తుల సౌలభ్యం మేరకు ఉదయం, రాత్రి వాహనసేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.

() చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయం.

Also Read:మార్నింగ్ వాక్.. రోగాలకు చెక్ !

() ఈ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణకు గాను అదనంగా కార్మికులను ఏర్పాటు చేసుకునేందుకు రూ.32.73 లక్షలు మంజూరుకు ఆమోదం.

() రూ.49.48 కోట్లతో టీటీడీ ఉద్యోగుల 1476 క్వార్టర్ల మరమ్మతులు చేపట్టేందుకు ఆమోదం.

()రూ.600 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనుక వైపు గల 2, 3 సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి ఆమోదం.

()టీటీడీ ఆధ్వర్యంలోని ధర్మగిరి, కీసరగుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, కోటప్పకొండ, తెలంగాణలోని నల్గొండ వేద విజ్ఞానపీఠాలకు సంబంధించి అదనంగా 47 అధ్యాపక పోస్టుల మంజూరుకు ఆమోదం.

- Advertisement -