నిర్మాత బెల్లంకొండపై కేసు నమోదు

6
- Advertisement -

నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు అయింది. ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్నారు శివ ప్రసాద్ అనే వ్యక్తి. కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లారు శివ ప్రసాద్.

మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించారు బెల్లంకొండ సురేష్ మరియు ఆయన అనుచరులు.

ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపాడు బాధితుడు శివ ప్రసాద్. అంతేగాదు శివ ప్రసాద్ సిబ్బందిపై అసభ్యకరంగా దూషిస్తూ దాడికి యత్నించారు బెల్లంకొండ సురేష్. దీంతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ సురేష్‌పై ఫిర్యాదు చేశారు శివ ప్రసాద్. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read:ధర్మేంద్ర మృతి చెందలేదు:ఇషా డియోల్

- Advertisement -