బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 64 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 10వ వారం నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగగా తాజా ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముందు హౌస్‌మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఎదురుగా టైమర్ పెట్టాడు. ప్రతి ఒక్కరూ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి.. అది కూడా మీ నామినేషన్ కేవలం ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.
తొలుత ఇమ్మానుయేల్ అయితే భరణిని నామినేట్ చేశాడు. నామినేట్ అయిన సభ్యులు షవర్ కింద కూర్చోగానే బురద నీరు పడుతుందన్నమాట. తర్వాత దివ్యని నామినేట్ చేసింది రీతూ. గౌరవ్‌కి ఛాన్స్ రాగా సంజనని నామినేట్ చేశాడు. అలాగే దివ్య.. గౌరవ్‌ని నామినేట్ చేయగా సుమన్ శెట్టికి ఛాన్స్ రాగానే నిఖిల్‌ని నామినేట్ చేశాడు. వైల్డ్‌కార్డ్స్‌గా మీరు వచ్చి ఐదు వారాలు పూర్తయింది.. కానీ ఇప్పటివరకూ మీరు పెద్దగా ఏం ఆడలేదు అంటూ సుమన్ అన్నాడు.
గౌరవ్‌ని నామినేట్ చేశాడు డీమాన్. నేను రెబల్ కాదని తెలిసి కూడా నువ్వు నన్ను రెబల్ అని చెప్పి రేసు నుంచి తీసేలా చేశావ్ అంటూ డీమాన్ తన పాయింట్ చెప్పాడు. సంజనకి ఛాన్స్ రాగానే గౌరవ్‌ని నామినేట్ చేసింది.ఇక చివరిలో రీతూని నామినేట్ చేశాడు నిఖిల్.
ఇక నామినేషన్స్ పూర్తయ్యాయి అని అందరూ అనుకునే సమయానికి బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ నామినేషన్ ఇంకా అయిపోలేదు అసలు విషయం ఇప్పుడే మొదలవుద్ది.. ఇప్పటివరకూ మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడారు.. చేయాల్సింది చేశారు.. ఇప్పుడు నా వంతు.. మీ పట్ల మీ ఆట పట్ల ప్రేక్షకులకి ఉన్న అభిప్రాయం మీరు ఎదుర్కోవాల్సిన సమయం ఇదే అని నేను నిర్ణయించాను.. అందుకే ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపేందుకు అందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నాను అంటూ బిగ్‌బాస్ షాకిచ్చాడు. మొత్తంగా ఇమ్మానుయేల్ మినహా మిగిలిన 10 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ చెప్పాడు.
Also Read:ధర్మేంద్ర మృతి చెందలేదు:ఇషా డియోల్

