కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. విఘ్నేశ్ కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి విషయంలో ఈ జంటపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విఘ్నేశ్ శివన్ తండ్రి శివ కొళుదు కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆయన బతికున్నప్పుడు తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా అమ్మేశారంటూ ఇతర సోదరులు ఈ జంట పై ఆరోపించారు. ఈ క్రమంలో వారంతా ఈ జంట పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ మధ్య నిర్మాతగా ప్రయత్నాలు చేసింది సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. కనెక్ట్ అనే సినిమాని నిర్మించి రిలీజ్ కూడా చేసింది. సినిమాలో మ్యాటర్ ఉన్నా.. డబ్బు మాత్రం రాలేదు. అలాగే నయనతార హోటల్స్ వ్యాపారం కూడా స్టార్ట్ చేసింది. ఆ రంగంలోనూ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. బహుశా ఈ నష్టాల్ని దృష్టిలో పెట్టుకునే ఆమె తన భర్త చేత ఆస్తులు అమ్మించి ఉంటుంది అని టాక్. అయితే ఈ విషయం పై నయనతార మాట్లాడుతూ ‘మనకు ఇష్టమైన వ్యక్తులు ఇలా మన పై ద్వేషం పెంచుకుంటే.. చాలా బాధగా ఉంటుంది.
Also Read:Modi:ఆర్ధిక శక్తిగా తెలంగాణ
నా భర్త పై కూడా ఆయన సోదరులు ద్వేషాన్ని పెంచుకున్నారు. కొన్ని పనుల మీద డబ్బు వెచ్చిస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు రావు. అంతమాత్రాన అందరూ ఒక్కటి అయ్యి ఒక వ్యక్తి పై ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఒక భార్యగా నా భర్త బాగు పై నేను ఎక్కువ దృష్టి సారించాల్సిన ఒత్తిడి ఉంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా అంటూ నయనతార చెప్పుకొచ్చింది.