హథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భోలే బాబాపై కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు లో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జూలై 2న నిర్వహించిన సత్సంగ్‌కు 80 వేల మందికి ఏర్పాట్లు చేయగా.. ఏకంగా రెండున్నర లక్షల మంది హాజరుకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
తొలిసారి మీడియా ముందుకు వచ్చిన భోలే బాబా… ఈ ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పాడు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు దేవ్‌ప్రకాశ్ మధుకర్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు.
తొక్కిసలాటపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read:జూలై 26 న గల్లీ గ్యాంగ్ స్టార్స్