- Advertisement -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఎంఐఎం నేతల ఫిర్యాదు మేరకు డబీర్ పురా పోలీసు స్టేషన్లో ఐపీసీ 153-A, 295-A, 505(1)(b)(c), 505 (2) , 506 సెక్షన్ల కింద రాజాసింగ్‌పై కేసు నమోదైందని సమాచారం.
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దీనిని నిరసిస్తూ ఎంఐఎం నేతలు ఆందోళనకు దిగారు. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని భారీగా ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజా సింగ్‌పై భవానీ నగర్, డబీర్ పురా, రెయిన్ బజార్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.
- Advertisement -