నాగశౌర్య తండ్రి అరెస్ట్..

100
naga
- Advertisement -

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాపై ఇటీవలె పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే పార్టీ సందర్భంగా పేకాట ఆడుతున్న 25 మందితో పాటు పెద్ద ఎత్తన డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇక ఈ కేసులో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫామ్‌హౌజ్‌ను లీజుకు తీసుకున్న శివ‌లింగ ప్ర‌సాద్‌.. ఆ లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించార‌ని ఆయ‌న‌పై కేసు న‌మోదైంది.

అయితే గుత్తా సుమ‌న్‌తో క‌లిసి శివ‌లింగ ప్ర‌సాద్ పేకాట నిర్వ‌హిస్తున్న‌ట్టు నిర్ధారించిన త‌ర్వాతే ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం శివ‌లింగ ప్ర‌సాద్‌ను ఉప్ప‌ర్‌ప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌రిచారు.

- Advertisement -