యువ హీరో అఖిల్‌రెడ్డి, రాశీసింగ్ హీరో హీరోయిన్లుగా ఏకె టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా పద్మరాజు యన్ దర్శకత్వంలో సోమరాజు కళ్యాణి నిర్మిస్తోన్న చిత్రం ‘పొగరున్నోడు’. ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి వేణుగోపాలచారి ముఖ్య అతిథిగా హాజరై పొగరున్నోడు
మూవీ ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏసిపి రామ్‌దాస్‌తేజ (అసెంబ్లీ ఇంచార్జ్), ఉప్పల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వైజాగ్ కార్పోరేటర్ సత్యనారాయణ, దర్శకులు శ్రీనివాస్ రెడ్డి, సముద్ర, జానీ మాస్టర్, సత్య మాస్టర్, సిగ్నేచర్ గ్రూప్ డైరెక్టర్ మహేంద్ర, మూర్తి మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ – అఖిల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నాడు. మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అఖిల్ ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – మోషన్ పోస్టర్ చూస్తుంటే హీరో విశాల్ సినిమా పోస్టర్ చూసినంత గొప్పగా ఉంది. దర్శకుడు పద్మరాజు చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నందుకు హ్యాపీగా ఉంది. చాలా పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా బ్రహ్మండమైన సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి (డమరుకం ఫేమ్) మాట్లాడుతూ అఖిల్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా మంచి విజయం సాధించి అతడికి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్
అన్నారు.
చిత్ర దర్శకుడు పద్మరాజ్ మాట్లాడుతూ – ఈ రంగంలో ఎన్నో ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన అఖిల్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్. సీనియర్ మోస్ట్ టెక్నీషన్స్, ఆర్టిస్టులు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ప్రేమ సన్నివేశాలతో పాటు రెండు పాటలను భీమిలి, ఆర్కే బీచ్ వంటి సుందరమైన ప్రాంతాల్లో చిత్రీకరించాం. త్వరలో చిత్రీకరణ పూర్తిచేసుకుని మీ ముందుకు వస్తాం
అన్నారు.
హీరో అఖిల్ రెడ్డి మాట్లాడుతూ – ఏకె టాకీస్ నా హోమ్ ప్రొడక్షన్. నా శ్రీమతి కళ్యాణి నిర్మాణ వ్యవహారాల్ని చూసుకుంటుంది. దర్శకుడు పద్మరాజ్ ఏడాది కాలం కష్టపడి ఈ సినిమాలో ఏ సీన్ ఎలా ఉండాలి అని పక్కాగా రాసుకుని నాకు నరేషన్ ఇచ్చారు. ఆయన చెప్పిన కథ నచ్చి ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. మణిశర్మ 6 అద్భుతమైన పాటలు ఇచ్చారు. అలాగే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. త్వరలోనే జానీ మాస్టర్‌తో కాశ్మీర్లో ఒక సాంగ్ షూట్ చేయబోతున్నాం. తర్వాత హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే మీ ముందుకు వస్తాం
అన్నారు.
అఖిల్ రెడ్డి, రాశిసింగ్, సముద్రఖని, సాయికుమార్, బాను చందర్, కాశి విశ్వనాథ్, ఇంద్రజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్ఒ: వంశీ-శేఖర్, సినిమాటోగ్రఫి: వెంకట్ గంగాధరి, మ్యూజిక్: మణిశర్మ, ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: పి ఎస్ వర్మ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, వెంకట్, కొరియోగ్రఫి: శేఖర్, జానీ, లిరిక్స్: శ్రీమణి, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీనివాస్ బండి, నిర్మాత: సోమరాజు కళ్యాణి, దర్శకత్వం: పద్మరాజ్ యన్.