రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు- పోచారం

356
pocharam
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో ఇవాళ కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మార్కెట్ కమిటీ నియామకాలలో కూడా రిజర్వేషన్లను తీసుకు రావడం జరిగిందన్నారు.

2014కు ముందు రాష్ట్రంలో 4.20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల గోదాములు ఉండగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రూ. 1100 కోట్లతో నూతనంగా 18.50 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించడం జరిగింది. బాన్సువాడ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పథకాలకు అనుమతులు మంజూరు చేశారు.

రూ. 150 కోట్లతో అలీసాగర్ వెనుక జలాలపై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువలో డిస్ట్రిబ్యూటర్ నంబర్-28 వరకు నీళ్ళు అందుతాయి. రూ. 100 కోట్లతో జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాలు, మంజీర నదిపై 4 చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈ పథకాలకు ముఖ్యమంత్రి త్వరలోనే శంకుస్థాపన చేస్తారని పోచారం తెలిపారు.

- Advertisement -