తెలంగాణ అన్ని రంగాలలో దేశానికే ఆదర్శం..

228
Pocharam Srinivas Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి ఈరోజు మీడియా సమావేశం జరిగింది. శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో పోచారం మాట్లాడుతూ… నాలుగు రోజులు జరిగిన తెలంగాణ రెండవ శాసనసభ మొదటి సమావేశాలను పూర్తి చేసుకున్నాం.,సహకరించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో 119 నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు ఎంతో నమ్మకంతో, ఆశతో శాసనసభ్యులను ఎన్నుకున్నారు. ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సభ్యులకు ఇది గొప్ప అవకాశం. 1977లో మొదటిసారిగా గ్రామస్థాయి సహకార సంఘం అధ్యక్షుడుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను.

గత ప్రభుత్వంలో మంత్రిగా నియమించి, ఈసారి రాష్ట్ర శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన సీఎంకు, సహకరించిన అన్ని పక్షాల సభ్యులకు ధన్యవాదాలు. విమర్శలు లేకుండా, అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. పదవులు వారసత్వం కాదు, ప్రజలు విశ్వాసంతో ఇచ్చినవి. ప్రజల ఆశయాలకు, అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. శాసనసభలో చక్కగా వ్యవహారించాల్సిన గురుతర బాధ్యత సభ్యులపై ఉంటుంది. సభ్యులకు బాధ్యతలు పెరిగాయి, అహంభావం పెరగలేదు. అందరం సభా మర్యాదలను గౌరవించాలి. సభ పవిత్రతను పెంచాలి.

Pocharam Srinivas Reddy

రాష్ట్ర ప్రగతి, పేద ప్రజల అభ్యున్నతి, రైతుల శ్రేయస్సు కోసం ఫలప్రదమైన చర్చలు జరగాలి. నాకు సభ్యులపై పూర్తి స్థాయిలో విశ్వాసం ఉన్నది. సభా కార్యక్రమాలు అర్ధవంతంగా జరిగే విదంగా సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నా. సభ్యులలో హుందాతనం ఉండాలి. అడ్డగోలుగా విమర్శలు చేయకూడదు. గత ప్రభుత్వంలో నేను నిర్వహించిన వ్యవసాయ శాఖ దేశానికే ఆదర్శం అయింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు ఇతర పథకాలతో దేశంలో నెంబర్ వన్ అయ్యాయి.

తెలంగాణ వ్యవసాయ శాఖ పథకాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దేశంలో నెంబర్ వన్‌గా ఉన్నది. శాసనసభ వ్యవహారాల విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా, నెంబర్ వన్‌గా ఉండాలి. తెలంగాణ శాసనసభ పనితీరు ఆదర్శంగా ఉండే విదంగా తీసుకెళ్ళుతాను. చట్టసభలలో ప్రతి నిమిషం, ప్రతి మాట విలువైనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాసనసభ నిర్వహించుకునే సత్తా ఉన్నదా అంటూ కొంతమంది వ్యంగంగా మాట్లాడారు. కాని ఈ రోజు తెలంగాణ అన్ని రంగాలలో దేశానికే ఆదర్శం అయింది.

నూతన శాసనసభ్యులు చిన్న చిన్న తప్పులు చేస్తే మీడియా వక్రీకరికరించకుండా పెద్ద మనసుతో మన్నించాలి. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు అద్దం పట్టింది. చట్టసభల పనితీరుపై అవగాహనా కోసం జర్నలిస్టులకు శిక్షణ తరగతులు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ప్రతి సభ్యునికీ మాట్లాడే అవకాశం కల్పిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతి కోసం ఎంతగా మాట్లాడితే అంత ఎక్కువ అవకాశం కల్పిస్తాం. ప్రజా సమస్యలపై సభ్యులు రాజకీయాలకతీతంగా సభలో వ్యవహరిస్తారని ఆశిస్తున్నా గాడి తప్పితే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాను. శాసనసభ పనిదినాల కాలపరిమితిపై నియమం ఏమీలేదు. సభ్యుల సలహా, BAC నిర్ణయం మేరకు అవసరమైనన్ని రోజులు సభ నడిపిస్తాం. అసెంబ్లీ వెబ్‌సైట్ ఆధునికరీస్తాం.

- Advertisement -