ఎంపీ సంతోష్‌కు ప్రత్యేక అభినందనలు- పోచారం

424
pocharam

ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ పరిసరాలను ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ప్రకటిస్తున్నాం. ఇకపై అసెంబ్లీలో ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్ వాడము. పర్యావరణ హిత వస్తువులే వాడతాం. మట్టితో తయారైన నీటి కుండలు, గ్లాస్‌లు ప్రవేశపెట్టామన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కి పర్యావరణ కమిటీ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు పోచారం.

తెలంగాణకు హరితహారం నిర్వహణకు గ్రీన్ ఛాలెంజ్ అదనపు ఆకర్షణగా నిలిచింది. సంతోష్ కుమార్ కృషి దేశ, విదేశాల్లో ఎంతోమందికి పర్యావరణ హితంపై ఆదర్శంగా నిలిచింది. నేను కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాను. ఇప్పటికే 3 కోట్లకు పైగా మొక్కలు నాటడం సామాన్యమైన విషయం కాదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

Telangana Assembly Speaker Pocharam Srinivas Reddy Praised MP Santhosh kumar On Green Challenge..