గద్దలకొండ గణేష్‌ని సస్పెన్స్‌లోకి నెట్టిన అద్వానీ..!

435
kiara advani

భరత్ అను నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కియారా అద్వానీ. ఈ మూవీ తర్వాత రామ్‌ చరణ్‌తో వినయ విధేయ రామలో మెరిసిన కియారా ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. కియారా నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో స్టార్ హీరోలంతా కియారా జపం చేస్తున్నారు.

ఇక గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ తన 10వ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో బాక్సర్‌గా కనిపించనున్నారు తేజ్‌. ఇటీవలె సినిమా పూజా కార్యక్రమాలు జరుగగా ఇందులో హీరోయిన్‌గా కియారాను సంప్రదించారట.

అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదట. దీంతో ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూస్తున్నారు చిత్రనిర్మాతలు. మొత్తంగా వరుణ్‌ని సస్పెన్స్‌లోకి నెట్టిన కియారా….చివరకు ఎలాంటి నిర్ణయాన్ని తెలుపుతుందా అన్న సందిగ్దం అందరిలో నెలకొంది.

Kiara Advani who rose to fame with Telugu films like ‘Bharat Ane Nenu’ and ‘Vinaya Vidheya Rama’ has been busy with multiple projects in Bollywood.