గ్రామస్వరాజ్యం కోసం కృషి: పోచారం

42
pocharam

బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని కొనియాడారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…బాపూజీ చూపిన మార్గంలో పయనిస్తూ తెలంగాణ ఏడేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామ స్వ‌రాజ్యం కోసం దేశం, రాష్ట్రం పున‌రంకితం కావాల‌ని పిలుపునిచ్చారు. గాంధీ చూపిన అహింసా మార్గంలో, కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ సాధించుకున్నామ‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండ‌లి చైర్మ‌న్ ప్రొటెం చైర్మ‌న్ భూపాల్ రెడ్డి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌, తెరా చిన్న‌ప‌రెడ్డి, వీజి గౌడ్, రాజ్యస‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యులతో పాటు ప‌లువురు పాల్గొన్నారు.