బిగ్ బాస్ 5..మళ్లీ జైలుకి జెస్సీ!

77
jessi

బిగ్ బాస్ 5 తెలుగు సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈవారం ఇంటి నుండి ఒకరు బయటికి రానుండగా శుక్రవారం ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. కెప్టెన్‌గా శ్రీరామచంద్ర బాధ్యతలు స్వీకరించగా తర్వాత బెస్ట్, వరెస్ట్ పెర్ఫార్మర్ ఎవరో తెలపాలని ఇంటి సభ్యులను కోరారు బిగ్ బాస్. దీంతో అంతా మానస్‌ని బెస్ట్ పెర్ఫార్మర్‌ అని జెస్సీని వరెస్ట్ పెర్ఫార్మర్‌ అని చెప్పడంతో జెస్సీ జైలుకు వెళ్లారు.

ఇక ఉదయాన్నే ఇంటి సభ్యులు మంచి సాంగ్‌కు డ్యాన్స్‌ చేయగా రవిపై నటరాజ్ మాస్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోబోతో గార్డెన్‌ ఏరియాలో మాట్లాడుతూ.. రవి నడిచి వస్తుంటే నత్తలా ఉంది అని సరదాగా కామెంట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రవి.. నటరాజ్‌ మాస్టర్‌ తనని బాగా ఇరిటేట్‌ చేస్తున్నాడని.. అడవిలో ఉన్న జంతువుల పేర్లన్నీ తనకే పెడుతున్నారని మండిపడ్డారు.

తర్వాత బిబి షో పేరుతో ఇచ్చిన టాస్క్‌లో ఇంటి సభ్యులందరూ పాల్గొన్నారు. సిరి.. హమీదాల్లో ఎవరిని ఎంచుకుంటారు?అని శ్రీరామచంద్రను హౌస్‌మేట్స్‌ ప్రశ్నించగా, లంచ్‌కు సిరి.. డిన్నర్‌కు హమీదాను ఎంచుకుంటానని చెప్పాడు. మరి టిఫిన్‌కు ఎవరు?అని ప్రశ్నించగా, శ్రీరామ్‌ నవ్వాపుకోలేకపోయాడు.

ఇక లోబో, ప్రియాంకల మధ్య ‘ఖుషి’ సినిమాలోని నడుము సీన్‌ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా ఈ వారం ఎనిమిది మంది నామినేషన్‌లో ఉండగా ఎవరు సేవ్ అవుతారో,ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచిచూడాల్సిందే.