సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ స్పీకర్,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఉదయం పోచారం ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. దీంతో కాంగ్రెస్‌లో చేరారు పోచారం, ఆయన తనయుడు భాస్కర్ రెడ్డి. రైతు బిడ్డను కాబట్టి.. వ్యవసాయంతో ఉన్నటువంటి అనుబంధం తెలుసు కాబట్టి వారు తీసుకుంటున్న నిర్ణయాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రేవంత్ కేబినెట్‌ను అభినందించిన పోచారం తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే ప్రారంభమైందన్నారు. రాష్ట్ర ప్రగతిలో చేదోడు వాదోడుగా ఉండాలనే నిర్ణయంతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు.
టీడీపీ,టీఆర్ఎస్ పార్టీల్లో పనిచేసిన కాంగ్రెస్‌తోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది…చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను అని వెల్లడించారు. పోచారం సూచనలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాం… రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం రేవంత్. పోచారంకు సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.
Also Read:నిద్రలో గుండెపోటు..జాగ్రత్తలివే!