ఓం బిర్లాను కలిసి స్పీకర్ పోచారం..

221
Pocharam Srinivas Reddy
- Advertisement -

రాజ్ భవన్ లోని అతిధి గృహంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జహీరాబాద్ ఎంపీ బిబిపాటిల్ కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను వారు కలిశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రెటరీ డా” నర్సింహా చార్యులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -