పరిసరాల పరిశుభ్రత గొప్ప కార్యక్రమం…

1017
pocharam bhaskar reddy
- Advertisement -

సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు” పరిశుభ్రత కార్యక్రమములో పాల్గొన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి.

భాస్కర్ రెడ్డి గారు బాన్సువాడ పట్టణము లోని వార్డ్ నం.10 చైతన్య కాలనీ లో నిలువ ఉన్న చెత్తను తీసేసి, చెట్లల్లో తాజా నీటితో నింపి. కారోన వ్యాధి వ్యాప్తి చెందకుండా బూమ్ స్ప్రయర్ తో రసాయనాలను స్ప్రే చేయించారు..

ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వారి ఇంటి పరిసరాలలో నిలువ ఉన్న చెత్తను , మురికి నీటిని ఎప్పటికప్పుడు తొలిగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని. అలా ప్రతి ఒక్కరు వారి పరిసరాలను పరిశుభ్రం చేసుకుంటే వారి కాలనీ మొత్తం పరిశుభ్రం అవుతుందన్నారు.

కాలనీలు పరిశుభ్రం ఉంటే పట్టణం పరిశుభ్రం అవుతుంది అలా మండలాలు, జిల్లా, రాష్ట్రం మొత్తం పరిశుభ్రతగా మారిపోతుంది, అనే ఆలోచన సంకల్పంతో ప్రతి ఆదివారం 10గం.10నిమిషాలు పరిశుభ్రత అనే పేరుతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పురపాలక శాఖ మంత్రి కే.టి. రామారావుకి మా బాన్సువాడ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజల తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

- Advertisement -